¡Sorpréndeme!

Benefits Of Different Types Of Homam మహా సుదర్శన హోమం ఎందుకోసం ..? | Oneindia Telugu

2022-04-18 22 Dailymotion

Significance of Homam and Types explained
#homam
#ganapathihomam
#sudarshanahomam
#dhanvantarihomam
#hindurituals

హిందూ మత విశ్వాసాల ప్రకారం, హోమానికి ఎంతో ప్రత్యేకత ఉంది. సాధారణంగా ఎవరి జాతకంలో ఏదైనా దోషం ఉంటే హోమం చేస్తారు. అలాగే సకాలంలో వర్షాలు కురవాలని పండితులు హోమం చేస్తుంటారు.ఈ హోమానికి మతపరంగా మాత్రమే కాదు.. శాస్త్రీయ ప్రాముఖ్యతను కలిగి ఉంది. పూర్వ కాలం నుండి ఈ హోమం నిర్వహించే సంప్రదాయం ఉంది. గ్రహాల ప్రభావంతో ఏమైనా ప్రతికూల ప్రభావాలు వచ్చే అవకాశం ఉంటే.. వాటిని శాంత పరచేందుకు హోమం నిర్వహిస్తారు.అలాగే హోమంలో మనం సమర్పించే వస్తువులతో, మనం కోరుకున్న కోరికలను అగ్నిదేవుడు నేరుగా దేవుళ్లకు చెబుతారని చాలా మంది నమ్ముతారు. ఈ సందర్భంగా హోమాల్లో ఎన్ని రకాలున్నాయి? హోమం చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు చేకూరతాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...