ఏలూరు నగరంలో ప్రైవేట్ ట్రావెల్స్ ఏజెన్సీ సిబ్బందిపై ఓ రౌడీ షీటర్ దాడికి పాల్పడ్డాడు. ట్రావెల్స్ ఆఫీస్‌పై తన అనుచరులతో సిబ్బందిని చితబాదారు. బస్ బుక్ చేసుకుని ఆలస్యంగా వెళ్లిన భీమవరపు సురేష్ అనే వ్యక్తి.. బస్‌ను వెనక్కి రప్పించాలని ట్రావెల్స్ సిబ్బందికి హుకుం జారీ చేశాడు. ఇతర ప్రయాణికులు ఇబ్బంది పడతారని.. కావాలంటే తరవాత బస్‌లో ఎక్కిస్తామని ట్రావెల్ సిబ్బంది చెప్పారు. ఈ క్రమంలో గొడవ చోటు చేసుకుంది.