¡Sorpréndeme!

జనసేన ఎనిమిదేళ్ల ప్రస్థానం.. పవన్ కళ్యాణ్ ప్రసంగంపై ఉత్కంఠ

2022-03-14 100 Dailymotion

రాజకీయ ప్రస్థానంలో ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న జనసేన.. నేటితో తొమ్మిదో వసంతంలోకి అడుగుపెడుతోంది. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ మహాసభ ఈ రోజు మధ్యాహ్నం నుంచి ప్రారంభమవుతుంది. మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో సభా స్థలాన్ని ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గుర్తుగా సభా ప్రాంగణానికి శ్రీ దామోదరం సంజీవయ్య చైతన్య వేదికగా నామకరణం చేశారు.