తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో సముద్రం సుమారు రెండు కిలోమీటర్ల మేర వెనుక్కు వెళ్లింది. గత ఐదు నెలల సమయంలో సముద్రం ఎన్నడూ లేనంతగా రెండు కిలోమీటర్ల మేర వెనక్కు వెళ్లడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. లైట్ హౌస్‌కు సమీపంలో కొంత మేర మాత్రమే ఇలా సముద్రం వెనక్కు వెళ్లింది. ఇక్కడ కొంత ప్రాంతం ఇసుక మేట వేయడం వలన సముద్రం పాటుకు వెళ్లే సమయంలో ఇలా కనిపిస్తోందని కొందరు మత్స్యకారులు అంటున్నారు. ఇదిలా ఉండగా సముద్ర తీరానికి 7 కిలోమీటర్లు దూరంలో ఉండే ఐలాండ్ కనుమరుగు కావడంపై నిత్యం పర్యటనకు వెళ్లే పర్యాటకులు అసంతృప్తి చెందుతున్నారు.