కరీంనగర్ పట్టణంలోని కలెక్టరేట్ ముందున్న కోపరేటివ్ సొసైటీ సేవ బ్యాంకులో రూ.34 లక్షల నగదు చోరీకి గురైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ పట్టణంలోని కలెక్టరేట్ ముందు గల మసీద్ కాంప్లెక్స్‌లోని ముస్లిం కోపరేటివ్ సొసైటీలో ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో దొంగలు చొరబడి రూ.34 లక్షల నగదు ఎత్తుకెళ్లారని అధికారులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు విచారణను కొనసాగిస్తున్నారు.