ఏపీ ఉద్యోగులు పీఆర్సీ ఉద్యమంలో దూకుడు పెంచారు. ప్రభుత్వం జీవోలను రద్దు చేయాలంటూ సచివాలయంలో ఉద్యోగులు పెన్‌డౌన్ చేపట్టారు. శనివారం సెలవు కావడంతో శుక్రవారమే సచివాలయంలో కంప్యూటర్లు షట్‌డౌన్ చేసి నిరసన తెలిపారు. దీంతో ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోయాయి. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని.. ఈ నెల 6 అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు ఉద్యోగులు ప్రకటించిన సంగతి తెలిసిందే.