వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ మోసం చేశారంటూ సొంత పార్టీ నేత వ్యాఖ్యలు సంచలనంరేపాయి. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో నిర్వహించిన మాజీ ముఖ్యమంత్రి రోశయ్య సంస్మరణ సభలో మాజీ ఎమ్మెల్యే సోమేపల్లి సాంబయ్య తనయుడు.. మర్రి రాజశేఖర్ బావ వెంకట సుబ్బయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు. మర్రి రాజశేఖర్‌కు ఎమ్మెల్సీ ఇవ్వకపోవడం మోసం చేయడమే అన్నారు.. పదవి ఇస్తామని చెప్పి ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో రజనికి టికెట్ ఇచ్చినప్పుడు తమని గుండెల్లో పెట్టుకొని చూస్తామన్నారని.. తమ ఆర్థిక పరిస్థితి మేరకు పార్టీకి సేవ చేశామన్నారు.