యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ షాపింగ్ కాంప్లెక్స్‌లో సొప్పరి రవి.. లేడీస్ ఎంపోరియం, గిఫ్ట్ కార్నర్ నడిపిస్తున్నాడు. నెలనెలా నాలుగైదు వందలు కరెంటు బిల్లు వస్తుంది. కానీ ఈ నెల వచ్చిన కరెంటు బిల్లు అక్షరాలా 6 లక్షల 46 వేల 360 రూపాయలు.