¡Sorpréndeme!

Ms Dhoni అంటే Gambhir కి అందుకే పడదు.. గంభీర్ ఆవేదనలో అర్థం ఉందా !

2021-07-08 365 Dailymotion

Gautam Gambhir's Cheeky Photo Update on Dhoni's Birthday Has Divided Fans
#Gambhir
#Dhoni
#Teamindia

టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్‌పై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ బీజేపే ఎంపీపై దుమ్మెత్తిపోస్తున్నారు. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బర్త్‌డే సందర్భంగా అతను చేసిన పనే ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణం. నేడు (బుధవారం) మహీ 40వ జన్మదినం జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అయితే గౌతం గంభీర్ ఈ రోజే తన ఫేస్‌బుక్ పేజీ కవర్ ఫొటో మార్చాడు. 2011 ప్రపంచకప్ ఫైనల్లో 97 పరుగులతో రాణించిన గంభీర్.. నాటి మ్యాచ్ ఫొటోను ఎఫ్‌బీ కవర్ పిక్‌గా పెట్టాడు. ఇది ఉద్దేశపూర్వకంగా చేశాడో లేక మాములుగానే పెట్టాడో తెలియదు కానీ అభిమానులు మాత్రం ఈ మాజీ ఓపెనర్‌పై దుమ్మెత్తి పోస్తున్నారు