2021 జనవరి 1 నుంచి ఫోర్ వీలర్ వాహనాలకు ఫాస్ట్‌టాగ్ తప్పనిసరి అని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. టోల్ వసూలు కోసం డిజిటల్ మరియు ఐటి ఆధారిత చెల్లింపులను ప్రోత్సహించడానికి, 1 డిసెంబర్ 2017 లోపు అమ్మిన వాహనాలతో సహా మొత్తం ఫోర్ వీలర్ వాహనాలకు తప్పనిసరి ఫాస్టాగ్ ఉండాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
డిసెంబర్ 1, 2017 నుండి ఉన్న ఫోర్ వీలర్ వాహనాలకు రిజిస్ట్రేషన్ తో పాటు ఫాస్ట్‌టాగ్ కూడా నమోదు చేయడం తప్పనిసరి అని కేబీద్ర ప్రభుత్వం ప్రకటించింది. మోటారు వాహన చట్టం 1989 ప్రకారం, ఫోర్ వీలర్ వెహికల్స్ కి రిజిస్ట్రేషన్ సమయంలో అన్ని వాహన తయారీదారులు మరియు డీలర్లకు ఫాస్టాగ్ జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
"వాహనాలకు ఫాస్ట్‌టాగ్ తప్పనిసరి" దీని గురించి మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.