సాక్షి, మహబూబ్‌నగర్ : భారీ వర్షాలకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో పలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో కొందరు సురక్షితంగా బయటపడగా మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సహయక చర్యలను మంత్రి శ్రీనివాస్ గౌడ్ పర్యవేక్షించారు. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం పోతుల మడుగు-గోపన్నపల్లి మధ్య కాజేవేపై దాటడానికి ప్రయత్నం చేస్తుండగా నీటి ప్రవాహానికి ఆటో కొట్టుకు పోయింది. ఆటోను ట్రాక్టర్ ద్వారా లాగడానికి ప్రయత్నించే క్రమంలో తాడు తెగటంతో ఆటో కిలోమీటర్ వరకు కొట్టుకు పోయింది. అంత దూరంలో నుంచి ఈదుకుంటూ డ్రైవర్ కనిమోని ఊశన్న బయటకు వచ్చాడు. ఆటో డ్రైవర్ ఊశన్న సురక్షితంగా బయట పడటంతో స్దానికులు ఊపిరి పీల్చుకున్నారు.