జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూ, భారత మార్కెట్లో తమ 320డి స్పోర్ట్ వేరియంట్‌ను తిరిగి విడుదల చేసింది. ఈ ఏడాది మార్చ్ నెలలో బిఎమ్‌డబ్ల్యూ తమ పెట్రోల్ వెర్షన్ 3 సిరీస్ కారు 330ఐ స్పోర్ట్ వేరియంట్‌ను విడుదల చేసినప్పుడు, ఇందులో 320డి స్పోర్ట్ మోడల్‌ను కంపెనీ నిలిపివేసింది.
బిఎమ్‌డబ్ల్యూ 320డి స్పోర్ట్ వేరియంట్, ఈ బ్రాండ్‌లో కంపెనీ అందిస్తున్న 3 సిరీస్ ఎంట్రీ లెవల్ డీజిల్ వేరియంట్‌గా ఉంటుంది. ఈ లగ్జరీ కారులో ఎల్‌ఈడి హెడ్‌లైట్స్, ఎల్‌ఈడి ఫాగ్ లైట్స్, పానోరమిక్ సన్‌రూఫ్, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.