¡Sorpréndeme!

Pak Stock Exchange News: గ్రెనేడ్లు, తుపాకులతో Karachi స్టాక్ ఎక్సేంజ్‌పై టెర్రరిస్టుల బీభత్సం

2020-06-29 14,875 Dailymotion

Pak Stock Exchange Latest Update News
#PakStockExchange
#Karachi
#KarachiStockExchange
#PakStockExchangeNews
#పాకిస్తాన్ స్టాక్ ఎక్సేంజ్‌
# కరాచీ

కరోనా మహమ్మారి విజృంభణతో కొద్దిగా నిదానించిన ఉగ్రమూకలు మళ్లీ విశ్వరూపం ప్రదర్శించాయి. కొవిడ్-19, మిడతల దాడితో సతమతమైపోతున్న పాకిస్తాన్ లో టెర్రరిస్టులు మరోసారి బీభత్సం సృష్టించారు. దేశంలోనే అతి పెద్ద నగరం, ఆర్థిక రాజధానిగానూ కొనసాగుతోన్న కరాచీలో దాడులకు తెగబడ్డారు. పాక్ ఆర్థిక వ్యవస్థలో కీలక భూమిక పోషించే స్టాక్ ఎక్సేంజ్ భవంతిని టార్గెంట్ గా చేసుకుని ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.కరాచీ సిటీలోని పాకిస్తాన్ స్టాక్ ఎక్సేంజ్ దగ్గర సోమవారం ఉగ్రదాడి జరిగింది. అత్యాధునిక తుపాకులు, గ్రెనేడ్లు చేతబట్టుకున్న సాయుధులు స్టాక్ ఎక్సేంజ్ బిల్డింగ్ పరిసర ప్రాంతాల్లోకి చొరబడి కాల్పులకు తెగబడ్డారు. ముందుగా గ్రెనేడ్లు పేల్చేసి, ఆ తర్వాత జనం బయటికి పరుగులు తీసే సమయంలో విచ్చలవిడిగా కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.