కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన అంశం.. రుతుస్రావ రోజులు. రుతుస్రావ రోజుల్లో వంట వండే మహిళలు వచ్చే జన్మలో కుక్కలుగా పుడతారని, దాన్ని భుజించే మగవారు ఎద్దులుగా జన్మిస్తారనీ కృష్ణ స్వరూప్ దాస్‌జీ చేసిన వ్యాఖ్యలపై మహిళలు భగ్గుమంటున్నారు. సహజసిద్ధంగా మహిళలకు సంభవించే రుతుస్రావ రోజులపై కృష్ణ స్వరూప్ ఘాటుగా స్పందించడాన్ని వారు తప్పు పడుతున్నారు. ఆయన కామెంట్స్‌కు నిరసనగా పీరియడ్ ఫీస్ట్ నిర్వహించారు.