¡Sorpréndeme!

నోట్ల రద్దుకు నేటితో రెండేళ్లు.. అది మా లక్ష్యం కాదు...!

2018-11-08 179 Dailymotion


నోట్ల రద్దు జరిగి సరిగ్గా ఈ రోజుకు (నవంబర్ 8) రెండేళ్లు. 2016 నవంబర్ 8న రాత్రిపూట నోట్ల రద్దు చేస్తూ సంచలన ప్రకటన చేశారు. రూ.500, రూ.1000 నోట్లను మోడీ రద్దు చేసిన విషయం తెలిసిందే. నోట్ల రద్దు ప్రకటనకు రెండేళ్లయిన సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. డబ్బును స్వాధీనం చేసుకోవడం ప్రభుత్వం లక్ష్యం కాదనిచెప్పారు. ఒక పద్ధదిగల ఆర్థిక వ్యవస్థను తీసుకురావడం కోసమే పెద్ద నోట్లను రద్దు చేశామని చెప్పారు. పెద్ద నోట్ల రద్దుతో నేటికి రెండేళ్లు పూర్తయిందని, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తీసుకున్న పలు నిర్ణయాల్లో ఇది చాలా కీలకమైనదని పేర్కొన్నారు.
#demonetisation
#ArunJaitley
#narendramodi
#Anniversary
#delhi