Savyasachi movie released today. here is the public talk.
#Savysasachi
#Savyasachipublictalk
#nidhiagarwal
#madhavan
#chandumondeti
#tollywood
అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘సవ్యసాచి’ దీపావళి కానుకగా శుక్రవారం నాడు (నవంబర్ 2) థియేటర్స్‌లో విడుదలైంది. అక్కినేని నాగచైతన్య, నిధి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా మైత్రీ మూవీస్ సంస్థ చైతూ కెరియర్‌లోనే అత్యధిక బడ్జెట్‌లో ఈ చిత్రాన్ని నిర్మించారు. వినూత్న కథాంశంతో ప్రేమమ్ ఫేమ్ చందు మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సీనియర్ నటుడు మాధవన్ నెగిటివ్ రోల్ పోషించగా సీనియర్ హీరోయిన్ భూమిక కీలకపాత్రలో నటించారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించారు. ‘సవ్యసాచి’ అనే డిఫరెంట్ టైటిల్‌తో సినిమా హైప్ తీసుకువచ్చిన దర్శకుడు టీజర్, ట్రైలర్‌లతో అంచనాలను రెట్టింపు చేశారు. భారీ అంచనాలతో నేడు థియేటర్స్‌లోకి వచ్చిన ‘సవ్యసాచి’ చిత్రం ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్ షోలు ప్రదర్శితం కావడంతో ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు ప్రేక్షకులు.