In a big shock to Telugu Desam Party in Andhra Pradesh, former Tirumala Tirupati Devasthanams chairman Chadalavada Krishnamurthy is all set to join the Jana Sena Party headed by power star Pawan Kalyan.
#ChadalavadaKrishnamurthy
#PawanKalyan
#TeluguDesamParty
#AndhraPradesh
#JanaSenaParty
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి జనసేనలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది. వచ్చే నెల దసరా రోజున ఆయన అధికారికంగా జనసేనలో చేరనున్నారని చెబుతున్నారు. ఆయన పార్టీ వీడటానికి పలు కారణాలు చూపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో తనకు సరైన గుర్తింపు లేకపోవడంతో ఆయన పవన్ కళ్యాణ్ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఇటీవల బ్రహోత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆయనకు సరైన గౌరవం ఇవ్వలేదని, ఇది ఆయనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని తెలుస్తోంది. కనీసం తనతో మాట్లాడలేదని వాపోతున్నారట.