TDP leaders, including CM Chandrababu, have been blaming the comments of YCP leader Vasantha Nageswara Rao about Minister Deveneni Uma.
#andhrapradesh
#amaravathi
#cmchandrababu
#ycp
#comments
#ministerdevineniuma
#tdpleaders
ఒక అధికారిని బెదిరించే సందర్భంగా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును ఉద్దేశించి మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై చెలరేగిన దుమారం కొనసాగుతోంది. వసంత నాగేశ్వరరావు హెచ్చరికలపై సిఎం చంద్రబాబుతో సహా టిడిపి నేతలు మండిపడుతున్నారు. వసంత నాగేశ్వరరావు గుంటుపల్లి పంచాయతీ కార్యదర్శికి ఫోన్ చేసి బెదిరించిన సంఘటన, దేవినేని ఉమా గురించి వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా ప్రతిస్పందించారు. సోమవారం అసెంబ్లీ వ్యూహ రచన కమిటీతో టెలికాన్ఫరెన్స్ సందర్భంగా సిఎం చంద్రబాబు వసంత వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ 'లేపేయడం ఏమిటి? మీకు నచ్చకపోతే.. ఎదురు నిలిస్తే లేపేస్తారా? ...అంటూ మండిపడ్డారు.