¡Sorpréndeme!

పర్యావరణాన్ని కాపాడుకోవడం మన బాధ్యత: సిఎం చంద్రబాబు

2018-08-09 100 Dailymotion

AP Chief Minister N Chandrababu Naidu who gives prime importance to advanced technology, introduced a new technology vehicles in Tourism development department. The Chief Minister Chnadra babu on Wednesday waved the flag which kick started the launch of electric vehicles which will be useful to tourists in Mangalagiri.
#andhrapradesh
#amaravathi
#cmchandrababu
#wave
#flag
#tourism


పర్యావరణ పరిరక్షణకు సహకరించే ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. మంగళగిరిలో ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ, మహీంద్ర ఎలక్ట్రిక్‌, జూమ్‌ కార్‌ సంయుక్త భాగస్వామ్యంతో రూపొందించిన బ్యాటరీ కార్ల శ్రేణిని బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు మాట్లాడుతూ ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు తదనుగుణమైన పలు విధానాలను ఇప్పటికే సిద్ధం చేశామని చెప్పారు.పర్యాటక సౌకర్యాల కల్పనలో రాజీ పడొద్దని అధికారులకు సూచనలు చేశారు. పర్యాటకులకు ఉపయోగపడేలా మహీంద్రా జూమ్‌ కార్లు రూపొందించడం ముదావ హమన్నారు. ఇప్పటికే పూనే, కోల్‌కతా, ముంబై, న్యూఢిల్లీ, జైపూర్‌, హైదరాబాద్‌, మైసూర్‌లలో ఇవి నడుస్తున్నాయన్నారు. దక్షిణ భారత దేశంలోనే అతిముఖ్యమైన కూడలి నగరంగా అమరావతి రూపుదిద్దుకుంటుందని సిఎం చంద్రబాబు చెప్పారు.