¡Sorpréndeme!

Arjun Sensational Comments On Going Issue

2018-08-06 1,112 Dailymotion

Hero Arjun comments on Film Industry Culture. Arjun daughter Aishwarya also in movie industry
తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో కాస్టింగ్ కౌచ్ గురించి హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. సంబంధం ఉన్న లేకున్నా ప్రతి ఒక్క నటుడు ఈ వివాదం గురించి స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజగా హీరో అర్జున్ కాస్టింగ్ కౌచ్ వివాదం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీరెడ్డి వ్యవహారంతో కాస్టింగ్ కౌచ్ గురించి మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. కాస్టింగ్ కౌచ్, తన కుమార్తె ఐశ్వర్య అర్జున్ గురించి అర్జున్ సంచలన వ్యాఖ్యకు చేశాడు.
చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉన్న మాట వాస్తవమే అని హీరో అర్జున్ తెలిపాడు. కానీ కేవలం చిత్ర పరిశ్రమలో మాత్రమే కాక అన్ని రంగాల్లో కాస్టింగ్ కౌచ్ ఉందని అర్జున్ తెలిపాడు. అందరికి దృష్టి సినిమాపైనే ఉండడంతో చర్చ జరుగుతోందని అన్నాడు.
ప్రతి చోట మంచి చెడు రెండూ ఉంటాయి. మంచి మార్గం ఎంచుకుంటే మనల్ని ఎవరూ అడ్డుకోలేరు. కానీ చెడు మార్గం ఎంచుకుంటే అది వారి దురదృష్టం మాత్రమే అని అర్జున్ తెలిపాడు.
ఇండస్ట్రీలో ఏదో జరుగుతోందని నేను భయపడాలా. నా కూతుర్ని ఇండస్ట్రీకి రానివ్వకుండా అడ్డుకోవాలా అని అర్జున్ ప్రశ్నించారు. సినిమాలతో సంబంధం లేనివారు కూడా వారి కుమార్తెలని ఇండస్ట్రీలోకి రాణిస్తున్నారుగా. వారి పరిస్థితి ఏంటి.