We have signed MoUs with our counterparts in the government, startups, academia and the industry. I am sure this would further propel the blockchain ecosystem in the State and would position us as a leading destination for Blockchain companies and investors: Minister KTR
#ktr
#ktramarao
#telangana
#blockchaincompanies
#hyderabad
బ్లాక్ చైన్ టెక్నాలజీ కేంద్రంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదును తీర్చిదిద్దుతామని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శుక్రవారం అన్నారు. హెచ్ఐసీసీలో జరిగిన అంతర్జాతీయ బ్లాక్ చైన్ కాంగ్రెస్ ఐటీ నిపుణుల సదస్సుకు ఆయన చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. ఈ సందర్భంగా కీలక ప్రసంగం చేశారు. తెలంగాణలో ఐటీ విస్తరణకు రెండేళ్ల క్రితం తమ ప్రభుత్వం సరికొత్త పాలనను తీసుకు వచ్చిందని తెలిపారు. అందులో 10 సాంకేతిక అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. అందులో బ్లాక్ చైన్ టెక్నాలజీ కూడా ఉందని తెలిపారు.