¡Sorpréndeme!

కరుణానిధి ఆరోగ్యంపై వైద్యుల ప్రకటన, 12 ఏళ్ల తర్వాత నెరవేరిన ఆయన కల!

2018-08-01 1,204 Dailymotion

కరుణానిధి ఆరోగ్యంపై కావేరీ ఆసుపత్రి వైద్యులు మంగళవారం ప్రకటన చేశారు. 28వ తేదీన బీపీ, పల్స్ పడిపోవడంతో కరుణానిధి ఆసుపత్రిలో చేరారని తెలిపారు. అప్పటి నుంచి ఐసీయూలో ఆయనకు చికిత్స అందిస్తున్నామన్నారు. మరికొన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉండాలన్నారు..కరుణానిధిని శ్వాస తీసుకోవడంలో ఆయన కొంత ఇబ్బంది పduthunnaaru. ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో ఆయన కోలుకుంటున్నారని తెలిపారు. వయసురీత్యా ఆయనకు ఆసుపత్రిలోనే చికిత్స పొడిగించడం అవసరమని చెప్పారు. కరుణానిధి వైద్యానికి బాగా స్పందిస్తున్నారని కావేరీ ఆసుపత్రి ఈడీ అరవింద్ తెలిపారు.
డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ పరామర్శించారు. 94 ఏళ్ల కరుణ చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ తదితరులతో కలిసి వచ్చిన రాహుల్ ఆయనను పరామర్శించారు.