¡Sorpréndeme!

Bigg Boss Malayalam : Unexpected Entry Of Anjali Ameer To Show

2018-07-31 5,809 Dailymotion

మలయాళ బిగ్‌బాస్ షోలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకొన్నాయి. ఇంట్లో బలమైన సెలబ్రిటీగా అందాల తార శ్వేత మీనన్ భావించారు. టైటిల్ గెలుచుకోవడం గ్యారంటీ అనుకొన్న శ్వేత అత్యంత డ్రామా మధ్య ఎలిమినేట్ కావడం ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది. అంతేకాకుండా గతవారం డబుల్ నామినేషన్ జరగడం మలయాళ ప్రేక్షకులకు మరో షాక్ తగిలింది. మలయాళ బిగ్‌బాస్‌కు మోహన్‌లాల్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
మలయాళ బిగ్‌బాస్‌లో గతవారం మిగితా సభ్యులతోపాటు శ్వేత మీనన్, రజనీ నామినేట్ అయ్యారు. డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని అంతా భావించారు. సడెన్‌గా ఎలిమినేషన్‌లో శ్వేతా మీనన్ పేరును మోహన్ లాల్ చెప్పడంతో ప్రేక్షకులు కంగుతిన్నారు. కేవలం ప్రేక్షకులే కాదు ఇంట్లో సభ్యులకు కూడా చెమటలు పట్టాయి.
బిగ్‌బాస్ నుంచి శ్వేతామీనన్ బయటకు వెళ్లడంపై అందరూ షాక్‌లో ఉంటే.. ఇంటి సభ్యుడైన సురేష్ ఆనందంలో మునిగిపోవడం వివాదాస్పదమైంది. శ్వేతా, రజని ఎలిమినేట్ కావడాన్ని సురేష్ అనే సెలబ్రిటీ పండుగ చేసుకోవడంతో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.
#BiggBossMalayalam
#ShwethaMenon
#AnjaliAmeer
#Mamootty