కుటుంబ సమస్యల కారణంగా ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకునేందుకు రైలు పట్టాలపై పడుకున్నాడు. గమనించిన వెంటనే స్పందించిన ప్రయాణికులు అతడ్ని కాపాడారు. ఈ ఘటన ముంబైలోని కుర్లా రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకుంది. కుర్లా రైల్వే స్టేషన్ లో జరిగిన ఈ ఘటన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. పట్టాలపై పడుకున్న వ్యక్తిని 54ఏళ్ల నరేంద్ర దమాజీ కోటేకర్‌గా గుర్తించారు. రైల్వే స్టేషన్‌లో చాలా మంది ఉన్నప్పటికీ కొందరు మాత్రం వెంటనే స్పందించి ఆయన ప్రాణాలు కాపాడారు.