వివాదాలలో చిక్కుకోవడం వర్మకు అలవాటే. ఇటీవల రాజ్ కుమార్ హిరానీ తెరక్కించిన సంజయ్ దత్ బయోపిక్ చిత్రం సంజు థియేటర్స్ లో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఎమోషనల్ గా ఈ చిత్రం అందిరికి కనెక్ట్ అయింది. కానీ వివాదాస్పద దర్శకుడు వర్మకు మాత్రం ఈ చిత్రం నచ్చలేదు. ఈ చిత్రంలో నిజాలు చూపించలేదని, వాస్తవాలు బయట పెట్టే విధంగా తాను మళ్ళీ సంజయ్ దత్ బయోపిక్ చిత్రం తీస్తానని వర్మ ఇటీవల ప్రకటించాడు. సంజయ్ దత్జీవితాన్ని కుదిపేసిన అక్రమాయుధాల కేసు గురించే తన చిత్రం ఉంటుందని ప్రకటించాడు.
Why is RGV putting us through so much pain. says Namrata Dutt on RGV’s Sanjay Dutt biopic
#SanjayDuttbiopic