¡Sorpréndeme!

చంద్రబాబు పై పవన్ ట్వీట్లు

2018-07-21 263 Dailymotion

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ నష్టం కలగకూడదనే.. పవన్‌ ట్వీట్లు చేస్తున్నారంటూ చంద్రబాబు శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ‘చంద్రబాబుగారూ మీకు ఇదే నా బదులు... అంటూ పవన్‌ శనివారం ఉదయం నుంచి వరుస ట్వీట్లు చేశారు. ‘బీజేపీని వెనకేసుకొస్తే మాకు(జనసేన) వచ్చే లాభమేంటి? ఏపీ ప్రజలు సంపూర్ణంగా బీజేపీని వదిలేశారు. అలాంటి పార్టీతో పొత్తు ఎవరైనా పెట్టుకుంటారా? వెనకేసుకొస్తారా? అసలు నా ట్వీట్ల ఉద్దేశం ఏంటంటే... బీజేపీతో సమానంగా టీడీపీ కూడా రాష్ట్ర ప్రయోజనాల్ని అంతేదారుణంగా దెబ్బకొట్టిందని. ప్రజలను మోసం చేశారు. వంచించారని అర్థమవుతోంది' అని పవన్ వ్యాఖ్యానించారు.

Janasena president Pawan Kalyan did satirical comments on Andhra Pradesh CM Chandrababu Naidu and TDP, MP Galla Jayadev.
#PawanKalyan
#Janasena