¡Sorpréndeme!

Ram Charan Talks About The BioPics

2018-07-14 934 Dailymotion

Mega power star Ram Charan Says that I’m interested in watching biopics because of the intrigue factor associated with them. But I’m not quite sure if I’ll be able to do complete justice to any person being depicted on screen... However, I can’t really say what’s in store for future.
#RamCharan

టాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా మొదలైంది. ఇతర ఇండస్ట్రీలతో పోల్చితే లేటుగా మొదలైనప్పటికీ లేటేస్టుగా తెలుగు పరిశ్రమ భారీ ఆదరణనే సొంతం చేసుకొంటున్నది. ఇటీవల వచ్చిన మహానటి చిత్రం భారీ విజయాన్ని అందుకొన్నది. టాలీవుడ్‌లో ఎన్టీఆర్ బయోపిక్ నిర్మాణంలో ఉండగా, త్వరలోనే పుల్లెల గోపిచంద్ బయోపిక్ సెట్స్‌పైకి వెళ్లనుంది. ఎక్కువ సంఖ్యలో బయోపిక్స్ వస్తున్న నేపథ్యంలో మెగా పవర్ స్టార్ వాటిపై తన స్పందనను వ్యక్తం చేశాడు.
బయోపిక్స్ చూడటమంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే వాటిలో ఓ వ్యక్తి భావోద్వేగాలు, ఆ జీవితంలో ఆటుపోట్లు తెరపైన చూడటమనేది చక్కటి అనుభూతి. కానీ నాకు బయోపిక్‌లో నటించడమంటే ప్రస్తుతం ఇష్టం లేదు. ప్రధానంగా ఏ వ్యక్తి జీవితం ఆధారంగా సినిమా రూపొందితే.. ఆయనకు న్యాయం చేస్తానో లేనో అనే సందేహం నాకే ఉంటుంది అని రాంచరణ్ అన్నారు.