¡Sorpréndeme!

Rajiv Gandhi : Untold Story రాజీవ్ గాంధీని ఎలా చంపారో తెలుసా??

2018-07-14 323 Dailymotion

Rajiv gandhi assassination,what exactly happened on that fateful night of may 21 in madras and new delhi.

40 ఏళ్ళ వ‌య‌సులో భార‌త యువ ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన రాజీవ్‌గాంధీ బ‌హుశా అప్పట్లో ప్ర‌పంచంలోనే అతి పిన్న‌వ‌య‌స్కులైన ప్ర‌భుత్వాధినేత‌ల్లో ఒక‌రు. ఆయ‌న త‌ల్లి ఇందిరాగాంధీ 1966లో మొద‌టిసారి ప్ర‌ధాన‌మంత్రి అయిన‌ప్పుడు ఆమె రాజీవ్ గాంధీ కంటె 8 ఏళ్ళు (48) పెద్ద‌. ప్ర‌ఖ్యాతివ‌హించిన‌ ఆయ‌న తాత పండిట్ జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ స్వేచ్ఛా భార‌తానికి తొలి ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్టేనాటికి వ‌య‌సు 58 సంవ‌త్స‌రాలు.
దేశంలో త‌రం మార్పుకు సంకేతంగా రాజీవ్‌గాంధీ దేశ చ‌రిత్ర‌లోనే అతిపెద్ద మెజార్టీ సాధించారు. హ‌త్య‌కు గురైన త‌న త‌ల్లి అంత్య‌క్రియ‌లు పూర్తికాగానే ఆయ‌న లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు ఆదేశించారు. ఈ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అంత‌కుముందు 7 సార్లు జ‌రిగిన ఎన్నిక‌లలో కంటే అత్య‌ధిక ఓట్ల‌ను సాధించింది. 508 లోక్‌స‌భ సీట్ల‌లో రికార్డుస్థాయిలో 401 సీట్లు గెలుచుకుంది.
#trendingnewsintelugu
#viralnewsintelugu
#telugusocialnews
#world
#bizarre
#weird