¡Sorpréndeme!

దర్శకుడి పై నటి నిషా సారంగ్ ఫిర్యాదు

2018-07-09 1,165 Dailymotion

మలయాళ సినీ పరిశ్రమలో హీరో దిలీప్ కేసు, అమ్మ(అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్) వివాదం ఇంకా మరువరక ముందే... మరో సంఘటన హాట్ టాపిక్ అయింది. దర్శకుడు తనను వేధించాడని, అతడి మీద ఫిర్యాదు చేసినందుకు సీరియల్ నుండి తొలగించారని నటి నిషా సారంగ్ ఆరోపించారు. ఈ ఘటనతో మలయాళ సినీ పరిశ్రమలో మహిళల పట్ల వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో మరోసారి బట్టబయలైనట్లయింది.
మలయాళంలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన సీరియల్ ‘ఉప్పుం ములకుం'లో నటి నిషా సారంగ్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సీరియల్‌కు ఆర్. ఉన్నికృష్ణన్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే కొంత కాలంగా దర్శకుడు తనను వేధిస్తున్నాడని, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని నిషా సారంగ్ ఆరోపించారు.
దర్శకుడు ఉన్నికృష్ణన్ వేధింపులపై ఛానల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేయడంతో తనపై ఆ కోపం పెంచుకున్నాడని.... తనను ఉన్నట్టుండి సీరియల్ నుండి తొలగించారని నిషా సారంగ్ ఆవేదన వ్యక్తం చేశారు.
సీరియల్ షూటింగ్ మొదలైనప్పటి నుండి దర్శకుడు తన పట్ల చెడుగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు, అసభ్యకరమైన సందేశాలు పంపేవాడు. వాటిని తాను పట్టించుకోవడం మానేశానను. దాంతో వేధింపులు మరింత ఎక్కువయ్యాయి.... అని నిషా సారంగ్ తెలిపారు.