చంద్రబాబు నాయుడు సంస్కృతికి ఈ దాడి నిదర్శనమని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. చెప్పులు విసిరే సంస్కృతి ఏ విధంగా ఆదర్శం అవుతుందని ప్రశ్నించారు. ఇలాంటి తాటాకు చప్పుళ్ళకు బీజేపీ బెదరదని చెప్పారు. మేం అధికారంలో ఉన్నా లేకున్నా వాస్తవాలు ప్రజలకు చెబుతామని, బాబు ప్రభుత్వంపై పోరాడుతామన్నారు. బాబు కుటిలనీతిని అడ్డుకుంటామన్నారు.
కన్నాపై చెప్పులదాడిపై వీర్రాజు సీరియస్ అయ్యారు. దాడి వెనుక కచ్చితంగా చంద్రబాబు ఉన్నారని భావిస్తున్నామని చెప్పారు. ఆయన పర్యవేక్షణలోనే ఈ దాడులు జరుగుతున్నాయన్నారు. బీజేపీ నేతలపై తిరగబడాలని చంద్రబాబే ప్రకటించారని, అందుకే ఆ పార్టీ వారే చేస్తున్నారన్నారు. టీడీపీ నేతలు కొరివితో తల కొరుక్కుంటున్నారన్నారు.
Bharatiya Janata party MLC Somu Veerraju serious on an incident on Kanna Laxminarayana.
#somuveerraju
#kannalaxminarayana
#bjp
#telugudesam
#anantapur