¡Sorpréndeme!

సిఎం చంద్రబాబు పోలవరం నిధుల గురించి గడ్కరీకి లెటర్

2018-06-26 279 Dailymotion

Amaravathi:Andhra Pradesh chief minister N Chandrababu Naidu on Monday wrote a letter to central minister for water resources Nitin Gadkari seeking reimbursement of Rs 1935.41 crore to the State for the Polavaram project.

కేంద్రం ప్రభుత్వంపై ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా మరో లేఖాస్త్రం సంధించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు గురించి కేంద్ర జలవనరుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీకి ఆయన ఈ లేఖ రాశారు.
ఈ ప్రాజెక్ట్ సకాలంలో పూర్తయేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలంటూ గడ్కరీకి రాసిన లేఖలో సిఎం చంద్రబాబు కోరారు. పోలవరం నిర్మాణం తో పాటు నిర్వాసితుల కోసం నిధులు విడుదల చేయాలని చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే తమ ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.1935 కోట్లు తక్షణమే విడుదల చేయాలన్నారు.
పోలవరం ప్రాజెక్ట్ కు ఈ ఏడాది మే నెలాఖరు నాటికి రూ.13,798.54 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని సీఎం చంద్రబాబు తన లేఖలో వివరించారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక 8,662.67 కోట్లు ఖర్చు చేస్తే కేంద్రం మాత్రం రూ.6,727.26 కోట్లు మాత్రమే అందించిందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తుచేశారు. అందువల్ల తమకి కేంద్రం నుంచి మరో 1935.41 కోట్లు రావాల్సి ఉందని చంద్రబాబు తెలిపారు.