¡Sorpréndeme!

Anchor Rashmi Gives Strong Counter To Netizen

2018-06-21 2,628 Dailymotion

Anchor Rashmi gives strong counter to netizen. Netizen gives suggetion to Rashmi marrying Sudheer

జబర్దస్త్ తో యాంకర్ గా రష్మీ, కమెడియన్ గా సుధీర్ బాగా పాపులర్ అయ్యారు. జబర్దస్త్ లో వీరి మధ్య మంచి కెమిస్ట్రీ ఉందనే అభిప్రాయం ఉంది. అందుకు తగ్గట్లుగానే వీరి మధ్య ఆఫ్ స్క్రీన్ లో కూడా కెమిస్ట్రీ జరుగుతోందనే రూమర్స్ ఉన్నాయి. ఈ రూమర్స్ ని సుధీర్, రష్మీ ఎప్పుడూ సీరియస్ గా తీసుకోలేదు. ఎలాంటి రూమర్స్ వచ్చినా వారి తరహాలోనే ఆడియన్స్ ని అలరిస్తూ వచ్చారు. వీరిమధ్య ప్రేమాయణం జరుగుతోందనే వార్తలపై రూమర్స్ సహజమే కదా అన్నట్లుగా గతంలో వీరి స్పందన ఉండేది. తాజగా సోషల్ మీడియాలో రష్మీకి చేదు అనుభవం ఎదురైంది. నెటిజన్ కు ఘాటుగా కౌంటర్ ఇచ్చింది.
ఓ నెటిజన్ సోషల్ మీడియాలో రష్మీకి సలహా ఇచ్చాడు. సుధీర్ ని పెళ్లి చేసుకో.. మీరిద్దరూ చూడచక్కనైన జంట. మీ కెరీర్ కోసం ఇద్దరూ బాగా కష్టపడుతున్నారు కూడా అని వ్యాఖ్యానించాడు.
నెటిజన్ ఇచ్చిన సలహా కు రష్మీ ఘాటుగా స్పందించింది. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని నువ్వు ఎలా సలహా ఇస్తావు. స్క్రీన్ పై జరిగే సన్నివేశాలని చూసి డిసైడ్ అయిపోతావా అంటూ రష్మీ మండిపడింది.
రీల్ లైఫ్, రియల్ లైఫ్ రెండూ వేరు అని మీరు తెలుసుకోవాల్సిన తరుణం వచ్చింది అని రష్మీ బదులిచ్చింది. తాము స్క్రీన్ పై చేసేది అంతా వినోదం కోసమే అని రష్మీ తెలిపింది.
తాము ఎవరిని పెళ్ళిచేసుకోవాలి అనేది తమ వ్యక్తిగత విషయం. ఇందులో మీ సలహాలు అవసరం లేదు అంటూ నెటిజన్ కు కౌంటర్ ఇచ్చింది.