¡Sorpréndeme!

తిరుమల తిరుపతి దేవస్థానంపై రమణదీక్షితులు మండిపాటు

2018-06-20 423 Dailymotion

Tirumala Tirupati former priest Ramanadeekshithulu lashed out at TTD for removing him as chief prist.
#TirumalaTirupati
#Ramanadeekshithulu

తిరుమల తిరుపతి దేవస్థానంపై మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు బుధవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చేసిన ఆరోపణలకు గాను తనకు తిరుమల తిరుపతి దేవస్థానం నోటీసులు జారీ చేసిందని చెప్పారు. వంద కోట్లకు పరువు నష్టం దావా వేశారన్నారు.
తద్వారా స్వామి వారి పరువు వంద కోట్లు మాత్రమే అని తేల్చేశారని మండిపడ్డారు. అసలు తాను చేసిన ఆరోపణలు తప్పు అని టీటీడీ నిరూపించాలని డిమాండ్ చేశారు. నా ఆరోపణలకు సమాధానం చెప్పలేక పరువునష్టం దావా వేశారన్నారు. మీ తప్పులను ప్రశ్నిస్తే ఉద్యోగం నుంచి తీసేస్తారా అని నిలదీశారు. ఇది ప్రజాస్వామ్యమా లేక నిరంకుశత్వమా అని నిప్పులు చెరిగారు.
తనను ఉద్యోగం నుంచి తప్పించే అధికారం తిరుమల తిరుపతి దేవస్థానంకు ఎవరు ఇచ్చారని రమణదీక్షితులు ప్రశ్నించారు. తిరుమలలో మలినమైన ప్రసాదాలు పెడుతున్నారని వాపోయారు. తిరు ఆభరణాలకు లెక్క చెప్పాలన్నారు. కలియుగంలో దైవం అంటే భయం, భక్తి లేకుండా పోయిందన్నారు.
వివిధ రాజవంశాలు స్వామివారికి పెద్ద ఎత్తున ఆభరణాలు సమర్పించాయన్నారు. 18 లక్షల బంగారు మొహర్లను నేలమాళిగలో భద్రపరిచారన్నారు. అమూల్యమైన నగలు ఉంచిన నేలమాళిగకు వంటశాల నుంచి దారి ఉందని చెప్పారు. గత డిసెంబర్ నెలలో ఈ వంటశాలను మూసివేశారన్నారు.