¡Sorpréndeme!

Renu Desai Warns Pawan kalyan Fans

2018-06-19 1,685 Dailymotion

"My cutie pie looking like a serious character from some noir European cinema. He was searching for some game trivia on his laptop with such super concentration.

పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన కొడుకైన అకీరా నందన్‌ను ముద్దుగా జూ పవర్ స్టార్ అని పిలించుకుంటారు. పవన్ కళ్యాణ్ సినీ వారసుడు అతడే అని, భవిష్యత్తులో ఆయన వారసత్వంతో తెలుగు సినిమాను ఏలుతాడని ఫ్యాన్స్ ఆశ పడుతున్నారు. అందుకే ఇప్పటి నుండే కుర్రోడికి జూ పవర్ స్టార్ అంటూ సెలబ్రిటీ స్టేటస్ ఇచ్చేసి హైప్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తన కుమారుడిని పవన్ అభిమానులు ఇలా పిలవడం రేణు దేశాయ్‌కు అస్సలు నచ్చడం లేదు. దీనిపై ఆమె ఘాటైన కామెంట్స్ చేశారు.
తన కుమారుడు అకీరాను ఎవరైనా జూ పవర్ స్టార్ అంటూ పిలిస్తే ఊకుకునేది లేదని రేణు దేశాయ్ మండి పడ్డారు. అలా పిలిచిన వారిని సోసల్ మీడియా పేజీలో బ్లాక్ చేస్తానంటూ రేణు దేశాయ్ వార్నింగ్ ఇచ్చారు.
జూనియర్‌ పవన్‌ కళ్యాణ్‌ అని పిలవడం అకీరాకు, వాడి నాన్నకు, వాడి అమ్మనైన నాకు ఇష్టం లేదు. కాబట్టి మీరు అలా అనడం ఆపండి అని రేణు దేశాయ్ సూచించారు.
నా క్యూటీ చూడటానికి యురోపియన్‌ సినిమాలోని ఓ సీరియస్‌ క్యారెక్టర్‌లా ఉన్నాడు. ఓ గేమ్‌ కోసం తన ల్యాప్‌టాప్‌లో ఆసక్తిగా వెతుకుతున్నాడు.... అంటూ తన కొడుకు ఫోటో పోస్టు చేసి మురిసిపోయింది రేణు దేశాయ్.