Telugudesam Party leaders CM Ramesh, Somireddy Chandramohan Reddy at Jana Sena chief Pawan Kalyan and YS Jagan Mohan Reddy.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన తెలుగుదేశం పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీడీపీ ఎన్డీయే నుంచి బయటకు రాగానే పవన్ పచ్చి ఆరోపణలు చేస్తూ ప్రజలకు నవ్వు తెప్పిస్తున్నారన్నారు. జీలకర్రలో కర్రలేనట్లుగా పిచ్చి ప్రేలాపణలు పేలుతున్నారన్నారు.
పవన్ కళ్యాణ్ పేరులో ఉన్న కళ్యాణ్ ఉంటే నిత్య పెళ్ళి కుమారుడని ఎద్దేవా చేశారు. బీజేపీ, వైయస్సార్ కాంగ్రెస్, జనసేన పార్టీలు లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని ఆయన మండిపడ్డారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల ఆగ్రహం ముందు మసి కాక తప్పదన్నారు. పిచ్చి ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
హేతుబద్దత లేకుండా విభజన చేసి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేసిందని, రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని శ్రీవేంకటేశ్వరస్వామి సాక్షిగా హామీ ఇచ్చిన బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం మోసం చేసిందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.