TTD former Chief priest Ramana Deekshithulu threw a challenge, saying he was ready for CBI probe and those who accused me are ready for trial?... On Monday, he spoke to media in Secunderabad.
#andhrapradesh
#hyderabad
#ttd
#ramanadeekshithulu
తనకు భారీగా ఆస్తులు ఉన్నాయని దుష్ప్రచారం చేస్తున్నారని, దీనిపై తాను సీబీఐ విచారణకు సిద్ధంగా ఉన్నానని...మరి నాపై ఆరోపణలు చేసిన వారు సిద్ధమా?...అని టీటీడీ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు సవాల్ విసిరారు. సోమవారం రమణ దీక్షితులు సికింద్రాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రతాపరుద్రుడు స్వామి వారికి సమర్పించిన అమూల్యమైన సంపద...అన్నపోటు వద్ద నిధిగా ఉందని బ్రిటీష్‌వారి శాసనంలో ప్రస్తావించారని...అందుకే అక్కడ నిధుల కోసం తవ్వకాలు జరిపారని రమణ దీక్షితులు ఆరోపించారు. అక్రమాలను బయటపెట్టినందుకే తనను ముందుగానే రిటైర్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా తనపై రెండుసార్లు హత్యాయత్నం జరిగిందని, వారసత్వంగా వచ్చిన ఇంటిని కక్షపూరితంగా కూల్చివేశారని రమణ దీక్షితులు ఆరోపించారు.