Nagarjuna-ram gopal varma officer movie first day collections report
#officermovie
#Nagarjuna
#ramgopalvarma
రాంగోపాల్ వర్మ ప్రతిభ గల దర్శకుడే. కానీ హిట్టు సినిమా తీసి చాలా సంవత్సరాలు గడుస్తోంది. ఈ తరుణంలో వర్మతో సినిమా చేయడానికి నాగార్జున ఎందుకు ఒప్పుకున్నారు అనే ప్రశ్న అభిమానుల్లో మొదలైంది. మరి కొందరు అభిమానులు మాత్రం శివ సినిమాని గుర్తు చేసుకుని వీరి కాంబినేషన్ మ్యాజిక్ చేసే అవకాశం ఉందని ఆశలు పెట్టుకున్నారు. కానీ వర్మలో దర్శకుడి పస పోయి చాలా కాలం అయిందని మరో మారు ఈ చిత్రం ద్వారా రుజువైంది. నాగార్జున కెరీర్ లోనే ఈ చిత్రం బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలవనుంది. అన్ని ఏరియాలలో ఈ చిత్రానికి దారుణమైన కలెక్షన్స్ నమోదవుతున్నాయి.
ఆఫీసర్ చిత్రం అంతంత మాత్రం అంచనాలతోనే విడుదలయింది. నాగార్జున, వర్మ కాంబినేషన్ మ్యాజిక్ చేసే అవకాశం ఉందని భావించి థియేటర్స్ కు వెళ్లిన అభిమానులు పూర్తి నిరాశతో వెనుదిరిగారు. తాము ఆశలు పెట్టుకోవడమే కానీ వర్మ మారే పరిస్థితి లేదని అర్థం అయింది.
స్టార్ హీరో సినిమా ఎంత డిజాస్టర్ అయినప్పటికీ తొలిరోజు వసూళ్లు ఎంతోకొంత బలంగా ఉంటాయి. నాగార్జున సినిమాకు కూడా మంచి వసూళ్లే నమోదు కావాలి. కానీ ఆఫీసర్ సినిమా పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు కేవలం 47 లక్షలు మాత్రమే వసూలు చేసింది. దీనితో ఈ సినిమా పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.