¡Sorpréndeme!

పోలీసులకు సహకరిస్తా : అర్బాజ్‌ ఖాన్‌

2018-06-04 98 Dailymotion

Adding details) Thane (Maha), Jun 2 (PTI) Bollywood actor and filmmaker Arbaaz Khan has told police that he has been betting on cricket matches for the past five to six years, a police official claimed today.
#ipl2018
#arbaazkhan
#indianpremierleague
#betting
#fixing
#cricket

ఐపీఎల్‌లో తాను బెట్టింగ్‌కు పాల్పడినట్లు బాలీవుడ్ నటుడు సల్మాన్‌ ఖాన్ సోదరుడు, నిర్మాత అర్బాజ్‌ ఖాన్ పోలీసుల విచారణలో అంగీకరించాడు. మహారాష్ట్రలోని థానే పోలీసుల ఎదుట శనివారం విచారణకు హాజరైన అర్బాజ్ ఈ మేరకు తన నేరాన్ని అంగీకరించాడు. అయితే, ఐపీఎల్ 11వ సీజన్‌లో తాను ఎలాంటి బెట్టింగ్‌కు పాల్పడలేదని స్పష్టం చేశాడు.
ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో బెట్టింగ్‌ల కేసుపై దర్యాప్తు జరుపుతుండగా అందులో అర్బాజ్ ఖాన్ పేరు రావడంతో అతనికి థానె పోలీసులు సమన్లు జారీ చేశారు. దీంతో అతడు శనివారం విచారణకు హాజరయ్యాడు. దీంతో పోలీసులు అతడి వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు.
ఈ బెట్టింగ్ కేసులో ఇంతకుముందే అరెస్టు చేసిన బుకీ సోను జలాన్‌తో సహా అర్బాజ్‌ ఖాన్‌ను సుమారు ఐదు గంటలకు పైగా పోలీసులు విచారించినట్లు తెలిసింది. విచారణలో అర్బాజ్‌ ఖాన్ పలు సంచలన విషయాలు వెల్లడించాడు. తొలుత బుకీలతో తనకేం సంబంధం లేదని అర్బాజ్ బుకాయించినప్పటికీ.. గతంలో అర్బాజ్‌ను బెదిరిస్తూ బుకీ జలన్ చేసిన చాటింగ్ వివరాలను పోలీసులు చూపించడంతో అసలు విషయాలను బయటపెట్టాడు. గత ఆరేళ్లుగా బుకీ సోనూ జలన్ తెలుసని విచారణలో అర్బాజ్ ఖాన్ ఒప్పుకున్నాడు.