¡Sorpréndeme!

జూన్ 2 ఏపీకి చీకటి రోజు: నవ నిర్మాణ దీక్షలో చంద్రబాబు

2018-06-02 1 Dailymotion

Chief Minister N Chandrababu Naidu reiterated that the government will not celebrate the State Formation Day celebrations on June 2 and will take Navnirman Deeksha from June 2 to 8. On June 2, Naidu will attend the event at Benz Circle in Vijayawada.
#navanirmanadeeksha
#andhrapradesh
#chandrababunaidu

జూన్ 2 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చీకటి రోజని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర విభజనతో ఏపీకి అన్యాయం జరిగిందని అన్నారు. రెండు జాతీయ పార్టీలు ఏపీకి తీరని ద్రోహం చేశామని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ నేపథ్యంలో విజయవాడ వేదికగా శనివారం నవ నిర్మాణ దీక్ష చేపట్టారు. సీఎం చంద్రబాబునాయుడు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, కొందరు మంత్రులు, ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్రాభివృద్ధికి ప్రజలను పునరంకితం చేసేలా గత నాలుగేళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఈ దీక్షను చేపడుతూ వస్తున్న విషయం తెలిసిందే.
శనివారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బందరురోడ్డులోని డీవీ మేనర్‌ సెంటర్‌ నుంచి అందరితో కలిసి ప్రదర్శనగా బెంజిసర్కిల్‌కు చేరుకున్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించి ముఖ్యమంత్రి స్వయంగా అందరితో నవ నిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ చేయించారు.