¡Sorpréndeme!

Is Telangana Statehood Aspirations Fulfilled Or Not

2018-06-01 38 Dailymotion

Neellu, Nidhulu, Niyaamakaalu (water, funds and jobs) is the main slogan for Telangana movement. After state formation,is telangana statehood aspirations are fulfilled?
#telangana
#telanganaformationday
#kcr
#trs
#Telangana History

నీళ్లు.. నిధులు.. నియామకాలు.. తెలంగాణ ఉద్యమానికి ప్రధాన ప్రాతిపదిక ఇది. వీటిని సాకారం చేసుకునేందుకే తెలంగాణ అవిశ్రాంతంగా లడాయి చేసింది. వెన్నుచూపక పోరాడింది. చివరకు గమ్యాన్ని ముద్దాడింది. కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కొలువుదీరి రేపటికి నాలుగేళ్లు. మరి తెలంగాణ ఆకాంక్షలు నెరవేరినయా?.. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో మారిందేంది.. మారనిదేంది? నీళ్లు: నిధులు.. నియామకాల కంటే నీళ్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించిందన్న అభిప్రాయం ఉన్నది. అధికారంలోకి వచ్చిన వెంటనే గోదావరిపై ప్రాజెక్టులకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వంతో సర్కార్ ఒప్పందం కుదుర్చుకుంది.
గోదావరి నదిపై నిర్మించతలపెట్టిన కాళేశ్వర, ప్రాణహిత ప్రాజెక్టులతో పాటు ఆదిలాబాదు జిల్లా సరిహద్దులో పెన్ గంగపై చనాక- కొరాటా ప్రాజెక్టుకు సంబంధించి చారిత్రక ఒప్పందం కుదిరింది. గోదావరి, ప్రాణహిత, పెనగంగ నదులపై చేపట్టే అంతర్రాష్ట్ర ప్రాజెక్టుల కోసం ఇంటర్‌ స్టేట్‌ బోర్టును ఏర్పాటు చేసుకుంటూ ఇరు రాష్ట్రాల సీఎంలు ఒప్పందం చేసుకున్నారు. దీంతో ఏళ్లుగా మహారాష్ట్రతో నడుస్తున్న జల వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టినట్టయింది.