¡Sorpréndeme!

Dhawan Says he Will Take Boundaries on Rashid

2018-05-30 52 Dailymotion

Again, the bowling shone for SRH with the young Rashid Khan leading the way, ... One could say that it was a total team effort on SRH's part to reach the final of the Match...
#rashidkhan
#shikhardhawan
#afghanistan
#sunrisershyderabad

సన్ రైజర్స్ ఆటగాళ్లు ధావన్, రషీద్‌లు ప్రత్యర్థులుగా మారి పోటీపడనున్నారు. త్వరలో అఫ్ఘనిస్థాన్‌తో జరగనున్న ఏకైక టెస్టులో పరుగులు రాబడతానని భారత ఓపెనర్ శిఖర్ ధావన్ ధీమా వ్యక్తం చేశాడు. అఫ్గనిస్థాన్ స్పిన్ సంచలనం రషీద్ ఖాన్‌ని సమర్థంగా ఎదుర్కొని బౌండరీలు సాధిస్తానని పేర్కొన్నాడు.
జూన్ 14 నుంచి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భారత్, అఫ్గనిస్థాన్‌ మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్‌లో ధావన్‌, రషీద్ ఖాన్ ఇద్దరూ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టుకే ఆడటంతో.. అతడ్ని ఎదుర్కొనే అవకాశం ఇంతవరకూ ధావన్‌కి రాలేదు. దీంతో.. రషీద్‌ని ఎదుర్కోవడం కష్టమే అయినా.. సవాల్‌గా తీసుకుని ఆడతానని ధావన్‌ వెల్లడించాడు.
'రషీద్ ఖాన్ బౌలింగ్‌ని తొలిసారి ఎదుర్కోబోతున్నాను. అతడి స్పిన్‌ని ఛేదించాలంటే చాలా కష్టమని నాకు తెలుసు. కానీ.. అత్యుత్తమంగా ఆడేందుకు ప్రయత్నిస్తా. ఏకైక టెస్టులో బరిలోకి దిగే భారత తుది జట్టులో నాకు అవకాశం దక్కితే.. రషీద్ ఖాన్ బౌలింగ్‌‌ రూపంలో నాకు ఓ కఠిన సవాల్ ఎదురుకానుంది' అని ధావన్ వెల్లడించాడు.