¡Sorpréndeme!

Nela Ticket Twiter Review నేల టిక్కెట్టు...ట్విట్టర్ రివ్యూ!

2018-05-25 2,351 Dailymotion

Nela Ticket movieTwitter Review. Kalyan Krishna is director of the movie. Ravi Teja and Malvika Sharma are main lead

మాస్ మహారాజ రవితేజ నటించిన నేల టికెట్ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రెండు వరుస విజయాలతో మంచి గుర్తింపు పొందిన కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్ వేడుక చూద్దాం వంటి చిత్రాలు ఈ దర్శకుడి నుంచి రావడంతో నేల టికెట్ చిత్రంపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. మాస్ మహారాజా రవితేజ అప్పియరెన్స్, డెబ్యూ బ్యూటీ మాళవిక శర్మ అందాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. యుఎస్, తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈ చిత్ర షోలు ప్రారంభమయ్యాయి. ట్విట్టర్లో వస్తున్న టాక్ ఎలా ఉందొ ఇపుడు చూద్దాం..
నేల టికెట్ చిత్రానికి డివైడ్ టాక్ కూడా వస్తోంది. సినిమా ఆశించిన స్థాయిలో లేదు. బిలో యావరేజ్ చిత్రం.
చిత్రంలో కనీసం కామెడీ కూడా లేదు. సినిమా రొటీన్ గా ఉంది. బోరింగ్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి. రవితేజకు ఇది మరో డిజాస్టర్.
రవితేజ తన సినిమాల విషయంలో కొత్తగా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఇలాంటి రొటీన్ కథలని విడిచిపెట్టాలి.
రవితేజ నుంచి మంచి మాస్ చిత్రాన్ని ఆశించిన ప్రేక్షకులకు నేల టికెట్ చిత్ర నిరాశ కలిగించే విధంగా ఉంది. రవితేజ నుంచి వచ్చిన మరో బ్యాడ్ మూవీ ఇది.
నేల టికెట్ చిత్ర యూనిట్ కు పవన్ కళ్యాణ్ ఫాన్స్ నుంచి శుభాకాంక్షలు అందుతున్నాయి. నేల టికెట్ చిత్రం హిట్ కావాలని కోరుకుంటున్నారు.
రవితేజ హిట్ కోసం నెక్స్ట్ మూవీ వరకు ఆగాల్సిందే. నేల టికెట్ చిత్రం డిజాస్టర్ టాక్ తో మొదలైంది.