Drunk and drive case On Director Bobby. FB post goes viral
#DirectorBobby
#tollywood
టాలీవుడ్ యువ దర్శకుడు బాబీ (కె ఎస్ రవీంద్ర) మద్యం మత్తులో తన కారుతో మరో కారుని ఢీ కొట్టిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాబీ ప్రతిభావంతుడైన యువ దర్శకుడిగా టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.బాబీ ఇప్పటి వరకు రవితేజ, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేశాడు. గత ఏడాది ఎన్టీఆర్ తో చేసిన జై లవకుశ చిత్రం మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. కమర్షియల్ చిత్రాల దర్శకుడిగా బాబీ స్థాయి పెరుగుతోంది.కెరీర్ పరంగా ఇప్పుడిప్పుడే బాబీ ఎదుగుతున్నాడు.
ఆదివారం రోజు దర్శకుడు బాబీ తన కారుని ఢీ కొట్టాడని ఓ బాధితుడు సోషల్ మీడియాలో తెలియజేసాడు. దర్శకుడిపై కేసు కూడా నమోదు చేసినట్లు బాధితుడు హర్మీందర్ సింగ్ తెలిపాడు. ఆ సమయంలో బాబీ మద్యం సేవించి వాహనాన్ని నడుపుతున్నాడని ఆరోపించాడు.
ఓ ఫ్యామిలీ ఫంక్షన్ నుంచి తిరిగి తన కుటుంబ సభ్యలతో వస్తుండగా రోడ్ నెం 33 వద్ద ఎరుపు రంగు వోల్వో కారు వెనుక నుంచి మా కారుని గుద్దింది. దర్శకుడు బాబీ ఆ కారులో ఉన్నాడు. ఎన్టీఆర్ పుట్టిన రోజు వేడుకలకు హాజరై అతడు తిరిగి వస్తున్నాడని, మద్యం సేవించి వాహనాన్ని నడిపాడని ఆరోపిస్తున్నాడు.