¡Sorpréndeme!

Savitri Daughter Replies To Kamala Ganeshan

2018-05-21 7 Dailymotion

Savitri daughter's Vijaya Chamundeswari counter to Gemini Ganesan’s daughter about Mahanati Controversy.

సావిత్రి జీవితంపై తెరకెక్కిన 'మహానటి' మూవీ సూపర్ హిట్ టాక్‌తో గొప్ప సినిమాగా పేరు తెచ్చుకుంది. అందరికీ నచ్చేలా ఒక గొప్ప సినిమా తీశామనే సంతృప్తిలో యూనిట్ సభ్యులు, అమ్మ గురించి అసలు నిజాలు ప్రేక్షకులకు ఈ సినిమా ద్వారా తెలిశాయనే సంతోషంలో సావిత్రి పిల్లలు ఉండగా....... జెమినీ గణేశన్ మొదటి భార్య పిల్లలు 'మహానటి'పై అంసతృప్తి వ్యక్తం చేయడం చర్చనీయాంశం అయింది. ఇందులో మా నాన్నను చాలా తక్కువ చేసి చూపించారని, నాన్న గురించి ఇందులో చూపింది అంతా అబద్దమే అని, దీన్ని మేము యాక్సెప్ట్ చేయబోమని ప్రకటన చేయడం విదానికి దారి తీసింది. ఈ వివాదంపై సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి స్పందించారు.
మా అక్క కమలా సెల్వరాజ్ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను. ఆమె వాదనను నేను ఖండించదలుచుకోలేదు. సినిమా నాకు నచ్చింది. నేను ఒక కోణం నుండి సినిమా చూశాను, ఆవిడ మరో కోణం నుండి సినిమా చూసి ఉండొచ్చు. మా అక్కకి అమ్మంటే(సావిత్రి) చాలా ఇష్టం. చాలా ఇంటర్వ్యూల్లో కూడా ఆమె ఈ విషయం చెప్పారు. అమ్మ మీద చాలా మర్యాద ఉంది. అయితే నాన్నను సరిపోయినంత చూపించలేదు అని ఆమె భావించారేమో? ఒక సినిమా చూసినపుడు ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది.... అని విజయ చాముండేశ్వరి వ్యాఖ్యానించారు.
సావిత్రికి మద్యం అలవాటు జెమినీ గణేశన్ చేసినట్లు తప్పుగా చూపించారని కమలా సెల్వరాజ్ అసంతృప్తి వ్యక్తం చేయడంపై సావిత్రి కూతురు స్పందించారు. అమ్మ పెరిగిన వాతావరణం చాలా స్ట్రిక్ట్. చౌదరి తాతయ్య ఎప్పుడైనా ఇంట్లో డ్రింక్స్ తీసుంటే అమ్మ గ్లాస్ వాసన చూసి అబ్బా ఇది ఎలా తీసుకుంటారు అని అరిచేదట. తర్వాత అమ్మకు మద్యం అలవాటయినపుడు తాతయ్య దాన్ని గుర్తు చేసుకుంటూ అలాంటి అమ్మాయి ఇలా అయిందేంటి అని బాధపడేవారు. నాన్న అమ్మను కూర్చోబెట్టి ఇదిగో తాగు అని నేర్పించలేదు. సినిమాలో కూడా అలా చూపించలేదు అని అన్నారు. సినిమా ఫీల్డులో ఒక స్థాయికి ఎదిగిన తర్వాత పార్టీలకు అటెండ్ కావడం, సోషల్ డ్రింకింగ్ చేయడం నార్మల్‌గా జరిగేదే. అమ్మకు కూడా సోషల్ డ్రింకింగ్ అలవాటు ఉండేది.... అని విజయ చాముండేశ్వరి తెలిపారు.