Heaping praise on Kane Williamson and including him in his list of top five current batsmen in the world, New Zealand national team coach Mike Hesson described the country's captain as having the skills to adapt to any format of the game.
#IPL2018
#Sunrisershyderabad
#KaneWilliamson
#MikeHesson
ఐపీఎల్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తోంది సన్ రైజర్స్ హైదరాబాద్. అయితే ఈ జట్టు కెప్టెన్‌ను ప్రపంచవ్యాప్తంగా పొగడ్తలు ముంచెత్తుతున్నాయి. ఇటీవలే మీడియా సమావేశంలో పాల్గొన్న న్యూజిలాండ్ కోచ్ మైక్ హెస్సన్ విలియమ్సన్‌పై ప్రశంసలు కురిపించాడు. ప్రపంచ టాప్-5 అత్యుత్తమ ఆటగాళ్లలో అతను కూడా ఒకడని కితాబిచ్చాడు.
'ఫార్మాట్ ఏదైనా పరిస్థితులకు తగ్గట్టుగా ఆడటం అత్యుత్తమ బ్యాట్స్‌మన్ లక్షణం. ఇందుకు విలియమ్సన్ మినహాయింపు కాదు. కేన్ చాలా తెలివైన ఆటగాడు. బంతి పడగానే బాదేయాలని చూడడు. ముందుగా సరైన పొజిషన్‌లోకి వచ్చి ఫీల్డర్లు లేని చోటుకే బంతిని తరలిస్తాడు. మంచి ఆల్‌రౌండర్. ప్రపంచస్థాయి ఆటగాళ్లలో కచ్చితంగా అతనికి స్థానం ఉంటుంది. కోహ్లీ, రూట్, స్మిత్ తర్వాతి స్థానంలో విలియమ్సన్ ఉంటాడు. భిన్న పరిస్థితులకు తగ్గట్టుగా ఆడటంలో వీళ్లందరూ దిట్టలే' అని హెస్సన్ పేర్కొన్నాడు.
ఈ సీజన్ ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో విలియమ్సన్ 493 పరుగులు చేశాడు. శిఖర్ ధావన్, విలియమ్సన్‌ల సూపర్ బ్యాటింగ్‌తో సన్‌రైజర్స్ అలవోకగా ఛేదించింది. హైదరాబాద్ తొమ్మిదో విజయంతో ఐపీఎల్-11లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా ఘనత సాధించింది.
లీగ్ ఆరంభం నుంచి బంతితో ఆకట్టుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈసారి బ్యాటుతో మెరిసింది. ధావన్ (92), విలియమ్సన్ (83) రెచ్చిపోవడంతో గురువారం జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై ఘనవిజయం సాధించింది. రిషబ్ పంత్ (128) విధ్వంసక సెంచరీతో మొదట ఢిల్లీ 5 వికెట్లకు 187 పరుగులు చేసింది. ధావన్-విలియమ్సన్ అభేద్యమైన రెండో వికెట్‌కు 176 పరుగులు జోడించడంతో లక్ష్యాన్ని సన్‌రైజర్స్ 18.5 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి అలవోకగా ఛేదించింది.