¡Sorpréndeme!

Mahanati Movie Public Talk మహానటి మూవీ పబ్లిక్ టాక్

2018-05-09 133 Dailymotion

Mahanati movie twitter review. Unanimous blackbuster talk from all over
#Mahanati
#savitri
#ntr
#keerthysuresh
#PublicTalk

తెలుగు ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సందర్భం రానే వచ్చింది. మహానటి సావిత్రికి అభిమానులు కానీ తెలుగు వారు ఉండరు. ఆమె సినీ జీవితం తిరుగులేని ప్రస్థానం. ఎన్టీఆర్, ఎన్నార్ లతో పోటీపడిన తొలి లేడీ సూపర్ స్టార్ సావిత్రి. ఆమె జీవితంలో ఎన్నో మధురమైన అనుభూతులు, ఒడిదుడుకులు ఉన్నాయి. సావిత్రి జీవితం గాధ వెండి తెరపై ఆవిష్కృతమవుతుంటే అందరిలో ఆసక్తి నెలకొనడం సహజమే. కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో నటిస్తూ రూపొందించిన చిత్రం మహానటి. దర్శకుడు నాగ అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అప్పట్లో అతిరథ మహారథులుగా చెప్పపడే నటుల పాత్రలో నేటి ప్రముఖనటులంతా నటించారు. ఇప్పటికే ఈ చిత్ర ప్రీమియర్ షోల ప్రదర్శన యుఎస్ లో పూర్తయింది. వెండి తెరపై చూపించిన సావిత్రి జీవిత చరిత్రకు అభిమానుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూద్దాం..