¡Sorpréndeme!

IPL 2018: SRH VS KXIP: KXIP Reveals Reasons to loss

2018-04-27 50 Dailymotion

KXIP Captain Ravichandran Ashwin Reveals the reasons to lose yesterday's match in the hands of SRH.


చెత్త బ్యాటింగ్‌, సన్‌రైజర్స్‌ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌ కారణంగా తాము ఓడిపోయామని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ పేర్కొన్నాడు. ఉప్పల్ స్టేడియంలో గురువారం రాత్రి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 13 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
మ్యాచ్ అనంతరం అశ్విన్ మాట్లాడుతూ 'చెత్త బ్యాటింగ్‌, సన్‌రైజర్స్‌ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌ కారణంగా మేము ఓడిపోయాం. మిడిల్‌ ఆర్డర్‌లో వరుసగా వికెట్లు కోల్పోయాం. అతీగా ఎదురుదాడికి పోయి కొన్ని వికెట్లు చేజార్చుకున్నాం. మా జట్టులో మంచి ఫినిషర్లు ఉన్నప్పటికీ ఈరోజు రాణించలేకపోయారు' అని చెప్పాడు.
'అయితే సరైన సమయంలో రాణిస్తారన్న నమ్మకం మాకుంది. మా టీమ్‌లో నాణ్యమైన ఆటగాళ్లకు కొదవలేదు. ఈ మ్యాచ్‌లో మా ఫీల్డింగ్‌ అస్సలు బాలేదు 20 ఓవర్ల మ్యాచ్‌లో ఎక్కువ క్యాచ్‌లు వదలేయడంతో చివరికి మూల్యం చెల్లించుకున్నాం. ఈ క్యాచ్‌లు పట్టివుంటే 20 నుంచి 30 పరుగులు తక్కువగా ఇచ్చేవాళ్లం. తర్వాత మ్యాచ్‌లో ఇలాంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్తపడతాం' అని అశ్విన్‌ చెప్పాడు.