¡Sorpréndeme!

శ్రీరెడ్డి-అభిరామ్ ఇష్యూలో రూ. 5 కోట్ల సెటిల్మెంట్ ప్రయత్నం, పవన్‌ను తిట్టడం వెనక అతడే....!

2018-04-19 1 Dailymotion

కాస్టింగ్ కౌచ్ అంశంపై పోరాటం చేస్తున్న నటి శ్రీరెడ్డి ప్రముఖ నిర్మాత, రామానాయుడు స్టూడియోస్ అధినేత సురేష్ బాబు కొడుకు అభిరామ్‌ ఫోటోలు లీక్ చేసి సంచలనం క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. 'మా' ఆఫీసు ముందు బట్టలు విప్పి అర్దనగ్న ప్రదర్శన, ఆమెపై ఇండస్ట్రీ బ్యాన్ విధించడం లాంటి సంఘటనత తర్వాత అభిరామ్ ఫోటోలు లీక్ చేయడంతో ఇండస్ట్రీలో వణుకు మొదలైంది. ఈ చర్యతో 'కాస్టింగ్ కౌచ్' ఆందోళన మరింత వేడెక్కింది. ఆ తర్వాత ఈ గొడవ అనేక మలుపులు తిరిగి చివరకు పవన్ కళ్యాణ్‌ను శ్రీరెడ్డి బూతులు తిట్టడం, ఆమెపై పవన్ కళ్యాణ్ అభిమానులు, ఇండస్ట్రీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎదురు దాడి చేయడం తెలిసిందే. తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ సంచలన విషయం బయట పెట్టారు.