BJP MLA Kuldeep Singh Sengar, the accused in the alleged humiliation 17-year-old girl in Unnao, was detained by CBI on Friday. The development comes a day after the Uttar Pradesh government handed over the cases of alleged and subsequent passeed of her father in judicial custody to the CBI.
17ఏళ్ల మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌ను సీబీఐ ఎట్టకేలకు అదుపులోకి తీసుకుంది. కేసు విచారణ సిట్ నుంచి సీబీఐ చేతిలోకి వెళ్లిన మరుసటిరోజే ఆయన అరెస్ట్ కావడం గమనార్హం. గురువారం కుల్దీప్ సింగ్‌పై యూపీ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అత్యాచారం, కిడ్నాప్, క్రిమినల్ బెదిరింపుల కింద కేసులు పెట్టారు. కేసును సీబీఐకి అప్పగించిన సిట్.. కస్టడీలో చనిపోయిన బాధితురాలి తండ్రికి సంబంధించి ఓ వీడియోను కూడా సమర్పించారు. పోలీసుల సమక్షంలోనే ఎమ్మెల్యే కుల్దీప్ సోదరుడు అతుల్ తనపై దాడికి పాల్పడ్డాడని అందులో అతను వాపోయాడు.
దీంతో మంగళవారం నాడు ఎమ్మెల్యే కుల్దీప్ సోదరుడు అతుల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
గురువారం ఇదే కేసుపై అలహాబాద్ హైకోర్టు విచారణ జరపగా.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నిందితుడిని ఎందుకు అరెస్ట్ చేయలేదన్న ప్రశ్నకు.. సరైన సాక్ష్యాధారాలు లేవని చెప్పడాన్ని కోర్టు తప్పుపట్టింది. ఇంతకుముందు కేసులన్నింటిల్లోనూ సాక్ష్యాలు లేకుండా ఎవరిని అరెస్ట్ చేయలేదా? అని చీఫ్ జస్టిస్ బోంస్లే ప్రశ్నించారు. రాష్ట్రంలో లా&ఆర్డర్ సక్రమంగా లేదని గ్రహించారు.
గ్యాంగ్ రేప్‌కు గురైన బాధితురాలు న్యాయం కోసం గత ఆర్నేళ్లుగా ఎన్నిసార్లు, ఎంతమంది చుట్టూ తిరిగిందో న్యాయమూర్తి పరిశీలించారు. కేసును నీరుగారుస్తున్నట్టు అర్థం చేసుకున్న ఆయన.. అడ్వకేట్ జనరల్ రాఘవేంద్ర సింగ్‌ను సైతం ఇదే ప్రశ్నించారు. 'నేను ప్రభుత్వం వైపు ఉండాలా? లేక బాధితురాలి వైపా?' అని ప్రశ్నించారు.