Krishnarjuna Yuddham twitter review. Nani dual role film directed by Merlapaka Gandhi
టాలీవుడ్ లో నాని వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. నాని నటించి ప్రతి చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కాసులు కురిపిస్తోంది. తాజగా నాని కృష్ణార్జున యుద్ధం చిత్రంతో నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మెర్ల పాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. నాని ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేసాడు. రుక్సార్ మీర్, అనుపమ పరమేశ్వరన్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. యూఎస్ లో ఇప్పటికే కృష్ణార్జున యుద్ధం షోలు ప్రదర్శించబడ్డాయి. ట్విటర్ లో అభిమానుల స్పందన ఎలా ఉందొ చూద్దాం..
ఫస్ట్ హాఫ్ చాలా బావుంది. సెకండ్ హాఫ్ యావరేజ్ గాఉంది. ఓవరాల్ గా కృష్ణార్జున యుద్ధం చిత్రం డీసెంట్ గా ఉంది.
నాని కృష్ణ పాత్రలో అదరగొట్టాడు. చిత్తూరు స్లాంగ్ లో అతడు చెప్పే డైలాగులు చాలా బావున్నాయి కృష్ణ పాత్ర చిత్రానికి హైలైట్.
కృష్ణార్జున యుద్ధం చిత్రంలో కామెడీ బావుంది. సెకండ్ హాఫ్ వీక్ గా ఉండడం వలన చిత్రం యావరేజ్ అనిపిస్తోంది.
ఎప్పటిలాగే నాని నటనతో అదాగొట్టాడు. మూడు పాటలు, ఫస్ట్ హాఫ్ లో కామెడీ చాలా బావుంది.
కృష్ణార్జున యుద్ధం చిత్రానికి హిట్ రిపోర్ట్స్ వస్తున్నాయి. మరో హిట్ సాధించిన నానికి కంగ్రాట్స్.
కృష్ణార్జున యుద్ధం యావరేజ్ గా ఉంది. నాని పెర్ఫామెన్స్ బావుంది. హిప్ ఆప్ సంగీతం చిత్రానికి ప్లస్ పాయింట్. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే దానిపై రిజల్ట్ ఆధారపడి ఉంది.
కృష్ణార్జున యుద్ధం చిత్రానికి భిన్నమైన స్పందన వస్తోంది. చిత్రం రొటీన్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉంది. సెకండ్ హాఫ్ బిలో యావరేజ్.